గోమూత్ర వ్యాఖ్యలకు లోక్‌సభలో ఎంపీ క్షమాపణ

తాను చేసిన గోమూత్ర వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌ బుధవారం లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు.

Published : 07 Dec 2023 05:35 IST

దిల్లీ: తాను చేసిన గోమూత్ర వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌ బుధవారం లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఓ అనుచిత పదాన్ని ఉపయోగించానని, ఏ దురుద్దేశంతోనూ దాన్ని వాడలేదన్నారు. ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఎవరి మనసునైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా క్షమాపణలు తెలిపిన ఆయన బుధవారం లోక్‌సభలోనూ విచారం వ్యక్తం చేశారు. అంతకుముందు భాజపా సభ్యులు సెంథిల్‌ కుమార్‌ వ్యాఖ్యలపై లోక్‌సభలో తీవ్ర నిరసనకు దిగారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయంలో సభను కొద్ది సమయంపాటు వాయిదా వేయాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని