విలీనం దిశగా.. మూడు విప్లవ పార్టీలు

మూడు విప్లవ పార్టీలు పీసీసీ సీపీఐ(ఎంఎల్‌), సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్‌) రెవెల్యూషనరీ ఇనిషియేటివ్‌లు త్వరలో ఉమ్మడి పార్టీగా విలీనమవుతున్నట్లు ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ కార్యనిర్వహణ కమిటీ కన్వీనర్‌ పోటు రంగారావు, గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి హన్మేష్‌లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

Published : 08 Dec 2023 04:44 IST

ఐక్యతా సమావేశ కార్యనిర్వహణ కమిటీ

నల్లకుంట, న్యూస్‌టుడే: మూడు విప్లవ పార్టీలు పీసీసీ సీపీఐ(ఎంఎల్‌), సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్‌) రెవెల్యూషనరీ ఇనిషియేటివ్‌లు త్వరలో ఉమ్మడి పార్టీగా విలీనమవుతున్నట్లు ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ కార్యనిర్వహణ కమిటీ కన్వీనర్‌ పోటు రంగారావు, గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి హన్మేష్‌లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. నవంబరు 28 నుంచి 30 వరకు కోల్‌కతాలో జరిగిన మూడు పార్టీల ఐక్యతా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చి 3, 4 తేదీల్లో ఖమ్మంలో జరగనున్న అఖిల భారత ఐక్యతా మహాసభలో ఉమ్మడి పార్టీకి సంబంధించిన విధివిధానాలు ప్రకటించడంతోపాటు రాజకీయ తీర్మానాలు చేస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని