సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి: ఎమ్మెల్సీ కె.కవిత

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని తెబొగకాసం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కె.కవిత పిలుపునిచ్చారు.

Published : 08 Dec 2023 05:37 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని తెబొగకాసం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కె.కవిత పిలుపునిచ్చారు. గురువారం ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో తెబొగకాసం నాయకులతో సమావేశం నిర్వహించి సింగరేణి ఎన్నికల నేపథ్యంలో వారికి దిశానిర్దేశం చేశారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడిన సంఘం తెబొగకాసం మాత్రమేనని  అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు ఎంతో పోరాడారని పేర్కొన్నారు. జాతీయ కార్మిక సంఘాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు కార్మిక హక్కులను ఏనాడూ కాపాడలేదని, తెబొగకాసం గెలిచిన తర్వాత సమ్మెలు లేకుండా కార్మికులకు హక్కులు సాధించిపెట్టిందని వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని