Gudivada Amarnath: మంత్రి అమర్‌నాథ్‌కు జగన్‌ ఝలక్‌

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు సీఎం జగన్‌ మరో ఝలక్‌ ఇచ్చారు. విశాఖకు ఈ నెల 22న రానున్న ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు.

Updated : 22 Feb 2024 10:59 IST

స్వాగత బాధ్యతల నుంచి తొలగింపు

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు సీఎం జగన్‌ మరో ఝలక్‌ ఇచ్చారు. విశాఖకు ఈ నెల 22న రానున్న ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. మంత్రిగా అమర్‌నాథ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖకు ప్రముఖులు వచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈసారి ఆ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి బూడి ముత్యాలనాయుడుకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వైకాపా అధిష్ఠానం అమర్‌నాథ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ బాధ్యునిగా మరొకరిని నియమించింది. ఇంతవరకు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసేది కూడా తేల్చలేదు. ఇప్పుడు ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యత నుంచి తప్పించడం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు