వేమిరెడ్డి దంపతుల్ని తెదేపాలోకి ఆహ్వానిస్తున్నాం: సోమిరెడ్డి

పది మందికి మేలు చేసే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లాంటి నాయకులే వైకాపాలో ఇమడలేక రాజీనామా చేశారంటేనే ఆ పార్టీ పోకడల్ని అర్థం చేసుకోవచ్చని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

Published : 22 Feb 2024 06:47 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పది మందికి మేలు చేసే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లాంటి నాయకులే వైకాపాలో ఇమడలేక రాజీనామా చేశారంటేనే ఆ పార్టీ పోకడల్ని అర్థం చేసుకోవచ్చని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వేమిరెడ్డి దంపతుల్ని తెదేపాలోకి ఆహ్వానిస్తూ బుధవారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘‘పేద పిల్లల చదువు కోసం ఆయన పాఠశాల నిర్మించారు. దేవాలయాలకు దానధర్మాలు చేస్తారు. అలాంటి వ్యక్తి తెదేపాలోకి రావాలి. రాష్ట్రంలో జగన్‌రెడ్డి, జిల్లాలో మంత్రులు విపరీత పోకడలకు పోతున్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవాలి. తెదేపా-జనసేన కూటమిని అధికారంలోకి తేవాలి’’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని