ముఖ్యమంత్రితో సిర్పూర్‌ ఎమ్మెల్యే హరీశ్‌బాబు భేటీ

కాగజ్‌నగర్‌, నిర్మల్‌ పట్టణం-న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం కుమురం భీం జిల్లా సిర్పూర్‌ భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు భేటీ అయ్యారు.

Published : 22 Feb 2024 06:32 IST

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం

ఈనాడు-హైదరాబాద్‌: కాగజ్‌నగర్‌, నిర్మల్‌ పట్టణం-న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం కుమురం భీం జిల్లా సిర్పూర్‌ భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు భేటీ అయ్యారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఆయనను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. అభివృద్ధి పనుల విషయమే సీఎంని కలిసినట్లు తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు, ఇతర సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందజేశానన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అయితే మంగళవారం నిర్మల్‌ జిల్లా భైంసాలో భాజపా నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు హరీశ్‌బాబు గైర్హాజరవడం గమనార్హం. ఇతర పార్టీ నేతలే భాజపా వైపు చూస్తున్నారని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం లేదని నిర్మల్‌ ఎమ్మెల్యే, పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విలేకరులతో పేర్కొన్నారు. అభివృద్ధి పనులు, ప్రజాసంక్షేమం విషయంలోనే హరీశ్‌బాబు ముఖ్యమంత్రిని కలిశారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని