మోదీ రామరాజ్యంలో ఉద్యోగాలు రావు: రాహుల్‌

దేశ జనాభాలో గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాకులు కలిపి దాదాపు 90% ఉన్నా వారికి అన్ని రంగాల్లోనూ అన్యాయమే జరుగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు.

Published : 22 Feb 2024 04:10 IST

కాన్పుర్‌/ ఉన్నావ్‌ (యూపీ): దేశ జనాభాలో గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాకులు కలిపి దాదాపు 90% ఉన్నా వారికి అన్ని రంగాల్లోనూ అన్యాయమే జరుగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రధాని మోదీ చెబుతున్న రామరాజ్యంలో వారెవరికీ ఉద్యోగాలు రావని, వివక్షే దీనికి కారణమని చెప్పారు. భారత్‌జోడో న్యాయయాత్రలో భాగంగా బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

26 నుంచి మార్చి 1 వరకు యాత్రకు విరామం

‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’కు అయిదు రోజుల పాటు విరామం ప్రకటించారు. బ్రిటన్‌ పర్యటనకు రాహుల్‌ వెళ్లనుండడం, లోక్‌సభ ఎన్నికల తరుణంలో ముఖ్య సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడం దీనికి కారణం. ఈ నెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు యాత్ర ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని