రాజ్యసభ సభ్యురాలిగా ధ్రువీకరణ పత్రం స్వీకరించిన రేణుకా చౌదరి

రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరి.. బుధవారం అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

Published : 22 Feb 2024 04:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరి.. బుధవారం అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

‘అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న భాజపా’

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో మాదిరిగానే దేశమంతా భాజపా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తదితరులతో కలిసి ఆమె బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యసభకు తనను ఎంపిక చేసినందుకు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌, ప్రియాంకాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది పదవి మాత్రమే కాదని, దీంతో బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నానన్నారు. ఖమ్మం ఎంపీ టికెట్‌ విషయంలో ఏఐసీసీ, ఎన్నికల కమిటీలు కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని, ఎవరికి టికెట్‌ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని