యూపీలో 17 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో విపక్ష ఇండియా (కూటమి)లో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. యూపీలో 80 స్థానాలకు గానూ 17 చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేయనుంది.

Updated : 22 Feb 2024 06:23 IST

ఎట్టకేలకు ఖరారైన పొత్తు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో విపక్ష ఇండియా (కూటమి)లో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. యూపీలో 80 స్థానాలకు గానూ 17 చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. మిగిలిన 63 చోట్ల సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), ఇతర మిత్రపక్షాలు బరిలో దిగుతాయి. కాంగ్రెస్‌ పోటీ చేసే స్థానాల్లో రాయ్‌బరేలీ, అమేఠీ, వారణాసి, ఝాన్సీ, మథుర, గాజియాబాద్‌ వంటివి ఉన్నాయి. ప్రతిష్టంభనను తొలగించడానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చొరవ తీసుకున్నారు. ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌తో ఆమె ఫోన్లో మాట్లాడడంతో పొత్తుకు మార్గం సుగమమైంది.  29 లోక్‌సభ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీ ఒక్క ఖజురహో స్థానంలో పోటీచేసి, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలకనుంది.హరియాణా, గోవా, అస్సాం, గుజరాత్‌లలో ఆప్‌నకు ఒక్కో సీటును ఇస్తామని, బదులుగా దిల్లీలో తమకు మూడు సీట్లు ఇవ్వాలని కోరుతున్నామని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర, తమిళనాడులో సీట్ల పంపకాలపై చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని