రాహుల్‌ యాత్రకు ప్రియాంక, అఖిలేశ్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొననున్నారు.

Published : 23 Feb 2024 04:19 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొననున్నారు. యాత్ర శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ చేరుకోగానే ప్రియాంకా గాంధీ కూడా భాగస్వామి అవుతారు. రాష్ట్రంలో పాదయాత్ర ముగిసే వరకూ ఆమె రాహుల్‌ వెంట ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఆగ్రాలో కొనసాగే జోడో యాత్రకు అఖిలేశ్‌ యాదవ్‌ హాజరవుతారని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు అఖిలేశ్‌కు ఆహ్వానం అందిందని పేర్కొన్నాయి.  

విలేకరిని వేధించడంపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆవేదన

రాయ్‌బరేలీలో రాహుల్‌ గాంధీ యాత్ర విశేషాల సేకరణకు వచ్చిన ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌ విలేకరి పట్ల కాంగ్రెస్‌ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడంపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. వ్యక్తులు లక్ష్యంగా దాడులు చేయడాన్ని రాజకీయ పార్టీలు నివారించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని