మోదీ ప్రభుత్వానిది ఆర్థిక ఉగ్రవాదం: కాంగ్రెస్‌

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతూ దేశంలోని ప్రధాన విపక్షాలను అణచివేసే కుట్రను అమలుచేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది.

Published : 23 Feb 2024 04:19 IST

దిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతూ దేశంలోని ప్రధాన విపక్షాలను అణచివేసే కుట్రను అమలుచేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి  తమ బ్యాంకు ఖాతాల నుంచి రూ.65 కోట్లను ప్రభుత్వం దోచుకుందని ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలను దెబ్బతీసే కుట్రలో బాగంగానే ఇదంతా జరుగుతోందని మండిపడింది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు కె.సి.వేణుగోపాల్‌, అజయ్‌ మాకన్‌, జైరాం రమేశ్‌ తదితరులు మాట్లాడారు. నిరంకుశ పాలనతో మోదీ ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని