కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తాకితే మాడి మసవుతారు

ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ సర్కారును కూల్చేస్తామంటూ కొన్ని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, తమ ప్రభుత్వాన్ని తాకితే మాడి మసైపోవడం ఖాయమని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Updated : 23 Feb 2024 06:23 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ కొత్తపల్లి, న్యూస్‌టుడే: ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ సర్కారును కూల్చేస్తామంటూ కొన్ని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, తమ ప్రభుత్వాన్ని తాకితే మాడి మసైపోవడం ఖాయమని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌ రేకుర్తిలోని సమ్మక్క-సారలమ్మలను మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి గురువారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని, సర్కారు ఏర్పడి 70 రోజులు కాకముందే విమర్శలు చేస్తున్న భారాస, భాజపాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేసీఆర్‌ సహకారంతో కిషన్‌రెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని పేర్కొన్నారు. బండి సంజయ్‌ని భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించారో తెలపాలని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని