28న తాడేపల్లిగూడెం సభను విజయవంతం చేయండి

తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జనసేన-తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కోరారు.

Published : 23 Feb 2024 04:41 IST

జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, అమరావతి: తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జనసేన-తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కోరారు. ‘ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి? ఉమ్మడి మేనిఫెస్టో తదితర అంశాలపై జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌, తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు’ అని చెప్పారు. గురువారం ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘పొత్తు ఖరారైన తర్వాత నిర్వహిస్తున్న అతి పెద్ద సభ ఇది. క్షేత్రస్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ సిద్ధం కావాలి’ అని సూచించారు. ‘సభకు ఇరుపార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం. నిర్వహణకు మరో 8 కమిటీలు ఏర్పాటు చేస్తాం’ అని వివరించారు. టెలికాన్ఫరెన్స్‌లో హరిప్రసాద్‌, కల్యాణం శివశ్రీనివాస్‌, ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కమిటీల సభ్యులు, నియోజకవర్గ బాధ్యులు, పార్టీ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని