వైఎస్‌కు జగన్‌ రాజకీయ వారసుడు కాబోరు: మంద కృష్ణ మాదిగ

సీఎం జగన్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి కుమారుడే కానీ, రాజకీయ వారసుడు కాబోరని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు.

Published : 23 Feb 2024 04:42 IST

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి కుమారుడే కానీ, రాజకీయ వారసుడు కాబోరని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ పర్యటనలు చేస్తున్న ఆయన పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం విలేకర్లతో మాట్లాడారు.జగన్‌ ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారని, అదే అంశంపై గత ఎన్నికల్లో కూడా మాట తప్పం.. మడమ తిప్పం అన్న మాటలను విశ్వసించి అధిక శాతం మాదిగలు ఓట్లు వేశారని తెలిపారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీని పూర్తిగా విస్మరించారని చెప్పారు. రాష్ట్రంలో మాదిగలు తక్కువ సంఖ్యలో ఉన్నారనుకుంటే భారీగా రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని