కర్నూలు వైకాపా సమన్వయకర్తగా ఇలియాస్‌ బాషా!

కర్నూలు వైకాపా సమన్వయకర్తగా డాక్టర్‌ ఇలియాస్‌ బాషా పేరు దాదాపుగా ఖరారైంది. ఐఏఎస్‌ అధికారి, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఏంఎడీ ఇంతియాజ్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, ఇలియాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపినట్లు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.

Published : 23 Feb 2024 04:42 IST

ఈనాడు, అమరావతి: కర్నూలు వైకాపా సమన్వయకర్తగా డాక్టర్‌ ఇలియాస్‌ బాషా పేరు దాదాపుగా ఖరారైంది. ఐఏఎస్‌ అధికారి, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఏంఎడీ ఇంతియాజ్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, ఇలియాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపినట్లు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు సిటింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ గురువారం తన కుటుంబ సభ్యులతో సహా వచ్చి ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగానే ఆయనకు కొత్త సమన్వయకర్త నియామకం గురించి చెప్పినట్లు తెలిసింది. తనను కొనసాగించాలని ఎమ్మెల్యే కోరగా.. ‘నీకైతే ఎస్వీ మోహన్‌రెడ్డి మద్దతివ్వడు. ఎందుకు ఇబ్బంది పడటం? పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక నీకు ఎలివేషన్‌ ఇస్తా’ అని ఎమ్మెల్యేకి జగన్‌ చెప్పినట్లు సమాచారం.

పెనమలూరు నేతలతో సీఎం వద్దకు మంత్రి రమేష్‌

పెనమలూరు వైకాపా సమన్వయకర్తగా నియమితులైన మంత్రి జోగి రమేష్‌కు అక్కడి స్థానిక నేతలతో పొసగడం లేదు. స్థానికేతరుడైన రమేష్‌ను ఇక్కడ నియమించడమేంటని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొందరు పెనమలూరు నాయకులను వెంటబెట్టుకుని సీఎంను కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని