జాబితాలో అక్రమాల్ని ప్రశ్నించినందుకే తెదేపా నేతలపై కేసులు

ఓటరు జాబితాలో అక్రమాల్ని ప్రశ్నించినందుకే నగరి నియోజకవర్గంలో తెదేపా నాయకులు ఎలుమలైరెడ్డి, షణ్ముగరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ఆరోపించారు.

Published : 23 Feb 2024 04:43 IST

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎంఏ షరీఫ్‌ ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఓటరు జాబితాలో అక్రమాల్ని ప్రశ్నించినందుకే నగరి నియోజకవర్గంలో తెదేపా నాయకులు ఎలుమలైరెడ్డి, షణ్ముగరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ఆరోపించారు. వైకాపా వాళ్లతో కుమ్మక్కైన బీఎల్‌వో తేజస్వి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారని, ఈ విషయాన్ని పరిశీలించి బీఎల్‌వోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి.. షరీఫ్‌ గురువారం ఫిర్యాదు చేశారు. ‘‘చౌటూరు గ్రామం నుంచి 8 మంది శాశ్వతంగా వలస వెళ్లినా ఓటరు జాబితాలో వాళ్ల పేర్లు అలానే ఉంచారు. దీనిపై ఆధారాలతో సహా బీఎల్‌వోకి ఫిర్యాదు చేసినా ఆమె స్పందించలేదు. కులాల వారీగా ఓటర్ల వివరాలు సేకరిస్తూ అధికార పార్టీ నాయకులకు అందజేస్తున్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని