కాటసాని భూ ఆక్రమణలపై చర్చకు సిద్ధం

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భూ ఆక్రమణలపై చర్చకు సిద్ధమని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్పష్టం చేశారు.

Published : 23 Feb 2024 04:49 IST

ఆధారాలన్నీ ఉన్నాయి
మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భూ ఆక్రమణలపై చర్చకు సిద్ధమని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్పష్టం చేశారు. ఆమె గురువారం కర్నూలులోని తెదేపా కార్యాలయంలో మాట్లాడారు. కాటసాని అవినీతిపై చర్చించేందుకు రావాలంటూ గతంలో తాను పలుమార్లు సవాల్‌ విసిరినా ఆయన వెనకడుగు వేశారన్నారు. అక్రమాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయని, దీనిపై ఆయన ఇంటికి వెళ్లి చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. లేకుంటే యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయం వద్దకు వచ్చినా సరేనన్నారు. ఈ సవాలును ఎదుర్కొనే ధైర్యం లేక రాంభూపాల్‌రెడ్డి చర్చకు రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ‘ఈనాడు’పై జరిగిన దాడికి.. తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పడం అబద్ధమన్నారు. తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని ఆరోపించారు. కాటసాని అనుచరులు కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం దారుణమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు