గిద్దలూరులో వాలంటీర్లకు నగదు పంపిణీ

వైకాపా అధిష్ఠానం పలు నియోజకవర్గాల్లో స్థానికేతరులను ఇన్‌ఛార్జులుగా నియమించడంతో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

Published : 23 Feb 2024 04:51 IST

రాజకీయంగా సహకరించాలని వైకాపా ఎమ్మెల్యే విజ్ఞప్తి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా అధిష్ఠానం పలు నియోజకవర్గాల్లో స్థానికేతరులను ఇన్‌ఛార్జులుగా నియమించడంతో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. స్థానికులకు మాత్రమే ఎన్నికల్లో సహకరిస్తామని కార్యకర్తలు, నాయకులు చెబుతుండటంతో వాలంటీర్లను ఉపయోగించుకుని ఓట్లను రాబట్టుకోవాలని అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులైన మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి వాలంటీర్లకు రూ.5 వేలు నజరానా అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం గిద్దలూరులోని పెద్ద పోస్టాఫీసు వీధిలో ఉన్న సచివాలయంలో నగదు అందించేందుకు వాలంటీర్లను పిలిపించారు. అనంతరం విషయం బయటకు వస్తుందని భావించి నాగార్జునరెడ్డి సోదరుడు గిద్దలూరు-నంద్యాల రహదారిలోని ఓ కౌన్సిలర్‌ ఇంటికి వాలంటీర్లను తీసుకెళ్లి నగదు అందించారు. తమకు రాజకీయంగా సహకరించాలని, అధికారంలోకి వచ్చిన తరువాత నివాస స్థలాలు ఇస్తామని ఆయన వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో మరికొందరు వాలంటీర్లకు నగదు ఇచ్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు