ఎంపీగా పోటీకి అవకాశం ఇవ్వాలని సీఎంను కోరా

‘ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతల నేపథ్యంలో ఈసారి ఎంపీ అయితే బాగుంటుందని.. అందుకే అరకు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వాలని ఇటీవల సీఎం జగన్‌ను కలిసి కోరా.

Published : 23 Feb 2024 04:56 IST

ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర

సాలూరు, న్యూస్‌టుడే: ‘ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతల నేపథ్యంలో ఈసారి ఎంపీ అయితే బాగుంటుందని.. అందుకే అరకు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వాలని ఇటీవల సీఎం జగన్‌ను కలిసి కోరా. ఆ కోరిక నెరవేరితే సంతోషిస్తా’ అని ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గురువారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘సాలూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈసారి ఎంపీ కావాలని కోరుకున్నా. సీఎం ఆ అవకాశం ఇస్తే ఆరోగ్యాన్ని కాపాడుకుని, భార్యాపిల్లలతో ఆనందంగా గడిపే అదృష్టం వచ్చిందని అనుకుంటా. అలా అని బాధ్యతలు మరచిపోను. మీరు (వాలంటీర్లు) జగన్‌నే కోరుకోవాలి. వాలంటీరు, సచివాలయ వ్యవస్థ ఉండాలంటే వైకాపా విజయం సాధించాలి’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని