భారత్‌ జోడో యాత్రకు కమల్‌నాథ్‌ మద్దతు

భాజపాలోకి వెళతారంటూ నిన్నామొన్నటిదాకా వార్తల్లో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ ఎట్టకేలకు పెదవి విప్పారు.

Updated : 24 Feb 2024 04:00 IST

భోపాల్‌: భాజపాలోకి వెళతారంటూ నిన్నామొన్నటిదాకా వార్తల్లో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ ఎట్టకేలకు పెదవి విప్పారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌జోడో న్యాయ్‌యాత్రకు మద్దతు ప్రకటించారు. ‘‘మా నేత రాహుల్‌గాంధీ యాత్ర వచ్చే నెలలో మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశిస్తోంది. ఆయనకు స్వాగతం పలకడానికి మధ్యప్రదేశ్‌ ప్రజలుఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అన్యాయం, అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మా నేత పోరాటం సాగుతోంది’’ అని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ ద్వారా కమల్‌నాథ్‌ ప్రకటించారు. కమల్‌నాథ్‌కు రాహుల్‌గాంధీ ఫోన్‌చేసి.. ఆయన భాజపాలోకి వెళ్లకుండా నచ్చజెప్పినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు