త్వరలోనే కవిత జైలుకు

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని కేంద్ర పౌర సరఫరాల, అటవీ, పర్యావరణ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబె అన్నారు.

Published : 24 Feb 2024 03:54 IST

కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబె

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని కేంద్ర పౌర సరఫరాల, అటవీ, పర్యావరణ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబె అన్నారు. భాజపా చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా లింగంపల్లి కూడలి నుంచి పటాన్‌చెరు వరకు ర్యాలీ నిర్వహించి, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. దిల్లీ లిక్కర్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవిత త్వరలోనే జైలుకు వెళ్లబోతున్నారని చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదన్నారు. ఆ పార్టీవారు యువరాజుకు ప్రధానమంత్రి కుర్చీ కావాలంటున్నారని, కుర్చీ ఇస్తే దేశాన్ని అమ్మేస్తారని అన్నారు. కేరళ నుంచి పార్లమెంటుకు పంపితే ఒక్కరోజు కూడా ఆయన ప్రజలకోసం పనిచేసింది లేదని, ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని అన్నారు.  సమావేశంలో నిర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని