దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశా

వారం రోజుల క్రితమే దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి తాను  రాజీనామా చేసినట్లు మల్లురవి వెల్లడించారు.

Published : 24 Feb 2024 03:55 IST

నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా  పోటీ చేసేందుకు సిద్ధం: మల్లురవి

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: వారం రోజుల క్రితమే దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి తాను  రాజీనామా చేసినట్లు మల్లురవి వెల్లడించారు. తాను నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేసేందుకు ఈ పదవి అడ్డు వస్తుందని భావిస్తే, తనకు అది వద్దని వివరిస్తూ రాజీనామా లేఖను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నాగర్‌కర్నూల్‌ ఎంపీ స్థానానికి పోటీ చేయాలనే ఉద్దేశంతో శాసనసభ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేయాలని పీసీసీ సూచించినా నేను వదులుకున్నా. కాంగ్రెస్‌లో 44 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశా. సర్వేల ఆధారంగా నాగర్‌కర్నూల్‌ స్థానంలో నాకు ప్రజల మద్దతు ఉంటేనే టికెట్‌ ఇవ్వమని కోరుతున్నా.  ఇక్కడి ప్రజల కోసం, సీఎం రేవంత్‌రెడ్డి కోసం, పార్టీ కోసం సేవలు అందించా. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజలు, పార్టీ కార్యకర్తల మద్దతు వందశాతం నాకే ఉంది. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌లో పార్టీ ఒక వ్యక్తికి ఒకే పదవి అని నిర్ణయించడంతో నాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి వద్దని, ఎంపీగానే పోటీ చేస్తానని ముందుగానే సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పా’’ అని మల్లు రవి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని