విజయ సంకల్ప యాత్రలతో రాజకీయాల్లో పెనుమార్పులు

భాజపా విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.

Published : 24 Feb 2024 03:56 IST

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రజలు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటేసినా  పార్లమెంటు ఎన్నికల్లో మోదీ కోసం భాజపా వైపు కదులుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు భాజపాకు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాత్ర దోహదపడుతుందని పేర్కొన్నారు. భారాస ప్రభుత్వ అవినీతిని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. భారాసతో భాజపా పొత్తుపెట్టుకుంటుందని కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని సీతారామపూర్‌ గ్రామంలో 1,110 ఎకరాల దేవాలయ భూమిని భారాస ప్రభుత్వం వ్యాపారవేత్తలకు అప్పగించిందని...ఆ అంశంపై ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం నోరెెత్తడంలేదన్నారు. ఆ భూముల కోసం భాజపా ఉద్యమం చేస్తుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు