రాహుల్‌ను కలుద్దామనుకుంటే.. బరువు తగ్గమన్నారు: జీషాన్‌ సిద్ధిఖీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మహారాష్ట్ర నేత బాబా సిద్ధిఖీ తనయుడు జీషాన్‌ సిద్ధిఖీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Published : 24 Feb 2024 04:19 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మహారాష్ట్ర నేత బాబా సిద్ధిఖీ తనయుడు జీషాన్‌ సిద్ధిఖీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌తో సమావేశం కావాలనుకుంటే తాను బరువు తగ్గాలని ఆయన సన్నిహితులు చెప్పారని ఆరోపించారు. ‘భారత్‌ జోడో యాత్ర మహారాష్ట్రలోని నాందేడ్‌కు వచ్చినప్పుడు.. రాహుల్‌తో భేటీ కావాలనుకున్నాను. అయితే, రాహుల్‌ను కలిసేందుకు నేను 10 కేజీలు తగ్గాలంటూ ఆయన సన్నిహితులు నాకు చెప్పారు’ అని జీషాన్‌ ఆరోపించారు. మైనార్టీ నాయకులు, కార్యకర్తలతో కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని విమర్శించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న బాబా సిద్ధిఖీ ఇటీవల ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ముంబయి యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి జీషాన్‌ సిద్ధిఖీను అధిష్ఠానం తొలగించింది. తనపై చర్యల విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే రాహుల్‌ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని