ధర్మశ్రీకి టికెటిస్తే మా పీకలు నులిమేస్తారు!

అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీకి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు.

Published : 24 Feb 2024 05:43 IST

సీఎం జగన్‌కు వైకాపా కార్యకర్తల లేఖ

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీకి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. బుచ్చెయ్యపేట మండలంలో రెండు రోజుల వ్యవధిలో రెండుచోట్ల అధికార పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించి ఈసారి ధర్మశ్రీకి టికెటిస్తే పనిచేసేది లేదని ప్రకటించారు. తాజాగా ధర్మశ్రీ, ఆయన సోదరుడు జయదేవ్‌ ఆగడాలపై ఓ లేఖ రాసి సీఎం జగన్‌కు పంపినట్లు తెలిసింది. చోడవరం ప్రజలు, కార్యకర్తల మనోభావాల పేరిట సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఆ లేఖ వైరల్‌ అవుతోంది. ‘అయ్యా.. చోడవరం నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు. ఒకరు అధర్మశ్రీ, మరొకరు ఆయన సోదరుడు పాపాల జయదేవ్‌. వీరు డబ్బు ఆశతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కార్యకర్తలు, నాయకుల దగ్గర కూడా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈసారి ధర్మశ్రీకి టికెట్ ఇస్తే మా పీకలు నులిమేస్తారు. మీరు టికెట్ ఇచ్చినా ప్రజలు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. గుత్తేదారుల నుంచి ముడుపులు పిండుకుంటున్నారు. నెలవారీ మామూళ్లు ఇవ్వాలని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. గోవాడ చక్కెర కర్మాగారంలో పాత ఇనుము తరలించి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అందువల్ల నియోజకవర్గానికి మంచి ఇన్‌ఛార్జిని నియమించండి’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని