భూ బదిలీ పత్రాలంటూ జగన్‌ మరో మోసం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సెంటు స్థలాల బదిలీ పత్రాల పంపిణీ పేరుతో సీఎం జగన్‌ మరో మోసానికి తెరలేపారని తెదేపా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు.

Updated : 24 Feb 2024 06:18 IST

తెదేపా ఎంపీ కనకమేడల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సెంటు స్థలాల బదిలీ పత్రాల పంపిణీ పేరుతో సీఎం జగన్‌ మరో మోసానికి తెరలేపారని తెదేపా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. ప్రతిపక్షనేతగా పేదలకు 25 లక్షల ఇళ్లు కట్టిస్తానన్న జగన్‌ ఇప్పటి వరకూ 5 లక్షల ఇళ్లే నిర్మించారని తెలిపారు. సెంటు స్థలాల పట్టాల పేరుతో నివాసయోగ్యం కాని, ఊళ్లకు దూరంగా ఉన్న భూములను అధిక ధరలకు కొని వైకాపా నేతలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. జగనన్న కాలనీల్లో కనీస వసతులు కల్పించకపోవడం పేదలను వంచించడం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.


వాలంటీరు వాట్సప్‌ గ్రూపుల్లో వైకాపా నేతల ప్రచారం

ఈనాడు, ఏలూరు: సంక్షేమ పథకాల సమాచారం తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వాలంటీరు గ్రూపుల్లోనూ వైకాపా నాయకులు ప్రచార పర్వానికి తెర తీశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు వాలంటీర్ల వాట్సప్‌ గ్రూపులో వైకాపా కార్యకర్త అయిన ఓ వాలంటీరు సందేశాలు పెట్టారు. ఆ గ్రూపులకు సంబంధం లేని మండలానికి చెందిన వైకాపా యువజన విభాగం అధ్యక్షుడిని అన్ని గ్రూపుల్లో యాడ్‌ చేయాలని ఆదేశించారు. అక్కడితో ఆగకుండా ‘మీ 50 ఇళ్ల గ్రూపులో తెదేపా, జనసేన కార్యకర్తలు ఉంటే.. తొలగించండి’ అంటూ సందేశం పెట్టారు. ‘ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సీఎం జగన్‌, ఎమ్మెల్యే వాసుబాబు గురించి పోస్టులు పెట్టండి’ అని ఆదేశించారు. వాలంటీరు వ్యవస్థ లక్ష్యం వైకాపాకు సేవ చేయడమేనని ఇలాంటి సందేశాలతో చెప్పకనే చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని