ఓడిపోయేందుకే నాపై గంటా పోటీ చేస్తున్నారు

ఎన్ని నియోజకవర్గాలు మారినా, ఓటమి లేని గంటా శ్రీనివాసరావు ఈసారి ఓడిపోయి.. ఆ రికార్డును మార్చుకునేందుకే తనపై పోటీ చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Updated : 24 Feb 2024 06:17 IST

మంత్రి బొత్స వ్యాఖ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్ని నియోజకవర్గాలు మారినా, ఓటమి లేని గంటా శ్రీనివాసరావు ఈసారి ఓడిపోయి.. ఆ రికార్డును మార్చుకునేందుకే తనపై పోటీ చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్నికల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారని, అలాగే గంటా చేస్తున్నారని శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. పండగ పూట గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రచారానికి వస్తున్నాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు ఏదో ఒకటి చేయాలన్నట్లు సభలు, సమావేశాలు పెడుతున్నారని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను అరెస్టు చేసిన విషయం తనకు తెలియదని, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అతిక్రమించబోదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని