ఉద్యోగాలే ఉంటే రోజులో 12 గంటలు మొబైల్స్‌ చూస్తారా?: రాహుల్‌

యువతకు ఉద్యోగాలే ఉండిఉంటే రోజుకు 12 గంటలు మొబైల్స్‌ చూస్తూ గడిపే పరిస్థితి ఎందుకు వస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.

Published : 25 Feb 2024 04:23 IST

లఖ్‌నవూ: యువతకు ఉద్యోగాలే ఉండిఉంటే రోజుకు 12 గంటలు మొబైల్స్‌ చూస్తూ గడిపే పరిస్థితి ఎందుకు వస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. యూపీలోని సంభల్‌లో శనివారం జరిగిన జోడో న్యాయ యాత్ర సభలో ఆయన మాట్లాడారు. రోజులో ఎంతసేపు మొబైల్‌ఫోన్‌ ఉపయోగిస్తారని ఓ యువకుడిని ప్రశ్నించారు. 12 గంటలపాటు అని వచ్చిన సమాధానంపై ఈ వ్యాఖ్య చేశారు. బడా పారిశ్రామికవేత్తల పిల్లలు రీల్స్‌ను చూడరని, రోజులో 24 గంటలూ డబ్బు లెక్కించుకుంటారని రాహుల్‌ చెప్పారు. యువతకు ఉద్యోగాలుంటే రోజులో 12 గంటలు పనిచేసుకుని అరగంటో, గంటో మొబైళ్లతో కాలక్షేపం చేస్తారని అన్నారు. కంపెనీల యజమానులు, మీడియా సంస్థలు, ప్రైవేటు కళాశాలలు, హైకోర్టుల న్యాయమూర్తుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటోందని చెప్పారు. తమ అభిప్రాయాలకు మీడియా తగినంత ప్రాచుర్యం కల్పించదని, కొన్ని సమస్యలూ తగినంత ప్రచారానికి నోచుకోవడం లేదని అన్నారు. ఆదివారం అమ్రోహా, ఆగ్రా మీదుగా సాగి ఫతేపూర్‌ సిక్రీ వద్ద యూపీలో ముగిసే యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు