ఒకటిన తిరుపతిలో కాంగ్రెస్‌ శంఖారావం

తిరుపతి వేదికగా మార్చి ఒకటిన కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం బహిరంగ సభ నిర్వహించన్నారు.

Published : 25 Feb 2024 04:08 IST

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: తిరుపతి వేదికగా మార్చి ఒకటిన కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం బహిరంగ సభ నిర్వహించన్నారు. ఈ మేరకు ఆ పార్టీ నగర అధ్యక్షుడు యార్లపల్లి గోపిగౌడ్‌ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఇందిరా మైదానం, ఎస్పీజేఎన్‌ఎం ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని పరిశీలించారు. రెండింటిలో ఒకదాంట్లో సభకు అనుమతి ఇవ్వాలని తుడా వీసీ వెంకటనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరు కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని