చంద్రబాబు నివాస మార్గంలో తెదేపా ఫ్లెక్సీల ధ్వంసం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద అమరావతి కరకట్టపై వైకాపా మూకలు రెచ్చిపోయాయి.

Updated : 25 Feb 2024 07:10 IST

అమరావతి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద అమరావతి కరకట్టపై వైకాపా మూకలు రెచ్చిపోయాయి. కరకట్ట మీదుగా చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో స్తంభాలకు ఇటీవల ఏర్పాటు చేసిన తెదేపా ఫ్లెక్సీలను వైకాపా నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. తుళ్లూరు మండలానికి చెందిన వైకాపా నాయకులు సందీప్‌, మరి కొంతమంది శనివారం సాయంత్రం కర్రలు, రాళ్లతో ఫ్లెక్సీలను కొట్టి, చించేశారు. వీఐపీలు రాకపోకలు సాగించే మార్గంలో కర్రలతో వీరంగం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నా నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని