వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా రాదు: లోకేశ్‌

ఈ సారి వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా రాదని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Published : 25 Feb 2024 04:09 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఈ సారి వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా రాదని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. శనివారం రాత్రి తాడేపల్లి పరిధిలోని బ్రహ్మానందపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్పా.. వైకాపా ప్రభుత్వం మంగళగిరికి చేసిందేమీ లేదన్నారు. ఈ సారి ఎన్నికలు ‘వార్‌ వన్‌ సైడే’ అన్నట్లుంటాయని చెప్పారు. ప్రజాభిప్రాయం తెలుసుకున్నాకే తెదేపా అభ్యర్థులను ప్రకటించారని వెల్లడించారు. విద్యార్థులు, ప్రత్యేక ప్రతిభావంతులతో మాట్లాడారు. అనంతరం మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 180 కుటుంబాలు లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని