గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో సమస్యలు పరిష్కరిస్తాం

గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మీరు లేవనెత్తిన విషయాలను, ఇచ్చిన సూచనలను నిశితంగా పరిశీలించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ చేసిన ట్వీట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో సమాధానమిచ్చారు.

Published : 25 Feb 2024 04:13 IST

‘ఎక్స్‌’లో ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌కు సీఎం రేవంత్‌ సమాధానం

ఈనాడు, హైదరాబాద్‌: గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మీరు లేవనెత్తిన విషయాలను, ఇచ్చిన సూచనలను నిశితంగా పరిశీలించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ చేసిన ట్వీట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో సమాధానమిచ్చారు. తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి ధన్యవాదాలని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగాపడిందో, వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూశామని సీఎం పేర్కొన్నారు. యువత భవితను పునర్నిర్మించాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తోందని వివరించారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికి ఎవరు ముందుకు వచ్చినా వారి విలువైన సూచనలు, సహకారం తీసుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. మున్ముందు కూడా ప్రజా సమస్యలేమైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని