గెలవడానికి ఎంతయినా ఇస్తాం: ఎంపీ కేశినేని నాని

‘వాళ్లు వంద ఇస్తే, మేము రెండొందలు ఇస్తాం. వాళ్లు రెండొందలు ఇస్తే మేము ఆరు వందలు ఇస్తాం. మూడు రెట్లు ఇవ్వడానికీ సిద్ధం’ అంటూ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Updated : 27 Feb 2024 08:23 IST

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ‘వాళ్లు వంద ఇస్తే, మేము రెండొందలు ఇస్తాం. వాళ్లు రెండొందలు ఇస్తే మేము ఆరు వందలు ఇస్తాం. మూడు రెట్లు ఇవ్వడానికీ సిద్ధం’ అంటూ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆదివారం రాత్రి వైకాపా శ్రేణుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ ‘మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతిరావు గెలుపు నా బాధ్యత. ఆయనకు పోటీగా నిలబడే వారు ఇచ్చిన దానికంటే నేను మూడు రెట్లు ఇచ్చి గెలిపిస్తా. పైన సీఎం జగన్‌, నియోజకవర్గంలో నేనుంటా’ అని శ్రేణులకు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఎన్నికల నిబంధనలు తెలిసిన ఆయన, తాయిలాలకు సంబంధించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కేశినేని నాని నాంది పలికారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు