హనుమ విహారిని వేధించారు

వైకాపా ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ లొంగిపోవడం సిగ్గుచేటని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 28 Feb 2024 04:23 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ లొంగిపోవడం సిగ్గుచేటని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా క్రికెటర్‌ హనుమ విహారిని వేధించారని ఎక్స్‌ వేదికగా మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు అండగా ఉండి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ‘విహారి.. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఆట పట్ల మీకున్న చిత్తశుద్ధిని వైకాపా కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవు. అన్యాయమైన చర్యలను ప్రజలు ప్రోత్సహించరు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్‌రెడ్డి పాలనలో ‘ఆడుదాం ఆంధ్రా’ అంటే.. క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడటమని కొత్తగా తెలిసింది. దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న శరత్‌చంద్రారెడ్డిని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఏసీఏ పరువు పోయింది’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని