13% పనులు చేయడానికి అయిదేళ్లు పట్టిందా!

తెదేపా ప్రభుత్వ హయాంలో కుప్పం బ్రాంచ్‌ కాలువ నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చు చేసి 87% పనులు పూర్తి చేస్తే.. మిగిలిన 13% పనులు పూర్తి చేయడానికి జగన్‌కు అయిదేళ్లు పట్టిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఎద్దేవా చేశారు.

Published : 28 Feb 2024 04:23 IST

కనకమేడల రవీంద్రకుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ప్రభుత్వ హయాంలో కుప్పం బ్రాంచ్‌ కాలువ నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చు చేసి 87% పనులు పూర్తి చేస్తే.. మిగిలిన 13% పనులు పూర్తి చేయడానికి జగన్‌కు అయిదేళ్లు పట్టిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముంగిట కాలువలో చెంబెడు నీళ్లు పారించడం గిమ్మిక్కేనని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేసి.. కుప్పం ప్రజలకు నీరందించాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని