మూత్రం పోయడానికి వచ్చినట్లుంది.. సీఎం కుప్పం పర్యటనపై చింతా మోహన్‌ ఎద్దేవా

హంద్రీనీవా కుప్పం బ్రాంచి కాలువకు ముఖ్యమంత్రి జగన్‌ నీళ్లు వదలడం.. ఆయన మూత్రం పోసి వెళ్లడంలా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఎద్దేవా చేశారు.

Published : 28 Feb 2024 04:25 IST

తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: హంద్రీనీవా కుప్పం బ్రాంచి కాలువకు ముఖ్యమంత్రి జగన్‌ నీళ్లు వదలడం.. ఆయన మూత్రం పోసి వెళ్లడంలా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఎద్దేవా చేశారు. తిరుపతిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నుంచి ఇప్పటి జగన్‌మోహన్‌రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ రాయలసీమకు ద్రోహం చేశారని విమర్శించారు. రాయలసీమలో రాళ్లూరప్పలు, బీడు భూములు తప్ప ఏమీ లేవని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని