ఎన్నికల ఏడాదిలో.. ఎన్ని కళలో

మరో రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాబోతోంది. అయినా వైకాపా ప్రభుత్వం పదవుల పంపకానికి వెనకాడటం లేదు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఖాళీగా ఉన్న కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్ని కట్టబెడుతుంది.

Published : 28 Feb 2024 04:26 IST

కార్పొరేషన్‌ పదవులు కట్టబెడుతున్న జగన్‌ సర్కారు

ఈనాడు-అమరావతి: మరో రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాబోతోంది. అయినా వైకాపా ప్రభుత్వం పదవుల పంపకానికి వెనకాడటం లేదు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఖాళీగా ఉన్న కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్ని కట్టబెడుతుంది. ఇటీవల చేపట్టిన నియామకాలను పరిశీలిస్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి అప్పగించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన చిల్లకూరు సుధీర్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య(ఏపీడీడీసీఎఫ్‌) ఛైర్మన్‌గా నియమించింది. నెడ్‌క్యాప్‌ సంస్థ ఛైర్మన్‌ బాధ్యతలను ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన వేల్పుల రవికుమార్‌కు కట్టబెట్టింది. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సురేంద్రను ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సహకార సంస్థ(ట్రైకార్‌) ఛైర్మన్‌గా నియమించింది. విశాఖపట్నానికి చెందిన ఎస్‌.చంద్రమౌళికి విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ (వీఎంఆర్‌డీఏ) ఛైర్మన్‌ పదవి అప్పగించింది. శాప్‌నెట్‌ ఛైర్మన్‌గా మాచాని వెంకటేశ్‌కు బాధ్యతలు కట్టబెట్టింది. త్వరలోనే 500 దేవాలయాలకు పాలకవర్గాలను నియమించడం ద్వారా 5 వేల మందికి పదవులు ఇస్తామని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని