Atchannaidu: జగన్‌.. అంతర్గత సమావేశంలోనూ చంద్రబాబు నామస్మరణేనా?: అచ్చెన్నాయుడు

ఎన్నికలు సమీపిస్తుండడంతో వైకాపా శ్రేణులకు ‘మేం సిద్ధం...మా బూత్‌ సిద్ధం’ పేరుతో ఆ పార్టీ ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలోనూ సీఎం జగన్‌.. చంద్రబాబు నామస్మరణే చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Published : 28 Feb 2024 07:17 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికలు సమీపిస్తుండడంతో వైకాపా శ్రేణులకు ‘మేం సిద్ధం...మా బూత్‌ సిద్ధం’ పేరుతో ఆ పార్టీ ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలోనూ సీఎం జగన్‌.. చంద్రబాబు నామస్మరణే చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విశ్వసనీయత అనే పదం వాడే అర్హతను జగన్‌రెడ్డి కోల్పోయారని విమర్శించారు. తెదేపా-జనసేన పొత్తు చూసి ఆయన భయపడుతున్నారని మంగళవారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘సిద్ధం సభలకు స్పందన రాకపోవడంతో తన భజనమిత్ర మండలి సమావేశం పెట్టి రాష్ట్రం నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉండండని పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటున్న జగన్‌ బహిరంగ చర్చకు సిద్ధమా? సీఎంగా కాదుగదా.. ఆయన కనీసం రాజకీయ నాయకుడిగానూ అనర్హుడే. తలకిందులుగా తపస్సు చేసినా కుప్పంలో కాదుకదా.. కనీసం పులివెందులలోనూ గెలవలేరు’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని