తాగునీటి సమస్యపై వైకాపా కార్పొరేటర్ల నిరసన

తాగునీటి కోసం అనంతపురంలో వైకాపా కార్పొరేటర్లు నిరసనకు దిగారు. రెండు నెలలుగా నగరంలో నీటి సరఫరా చేయకపోవడంతో ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది.

Published : 28 Feb 2024 04:38 IST

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: తాగునీటి కోసం అనంతపురంలో వైకాపా కార్పొరేటర్లు నిరసనకు దిగారు. రెండు నెలలుగా నగరంలో నీటి సరఫరా చేయకపోవడంతో ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో వైకాపా కార్పొరేటర్లు స్థానికులతో కలిసి మంగళవారం నగరపాలక కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

ప్రజలు ఖాళీ బిందెలు, కుండలతో కార్యాలయం ఎదుట బైఠాయించారు. లోనికెళ్లేందుకు యత్నించగా పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు. ఆగ్రహించిన 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌బాబా ఫకృద్ధీన్‌, యువకులు గేటు ఎక్కి కమిషనర్‌ కార్యాలయ ప్రాంగణంలోకి దూకారు. పలువురు మహిళలూ గేట్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో 23వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ హరిత, ఆమె భర్త జయరాం నాయుడు, పెద్దఎత్తున స్థానికులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని