ఇప్పటికి ఆరుగురు ఎంపీలు ఔట్‌

అధికార వైకాపాలో పార్లమెంటు సభ్యుల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Published : 29 Feb 2024 04:03 IST

ఈనాడు, అమరావతి: అధికార వైకాపాలో పార్లమెంటు సభ్యుల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. సరిగ్గా వారం కిందటే వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లోక్‌సభ సభ్యులు డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ (కర్నూలు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), రఘురామకృష్ణరాజు (నరసాపురం) రాజీనామా చేశారు. అంటే అయిదుగురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు వైకాపాను వీడారు. మరోవైపు గొడ్డేటి మాధవి (అరకు), గోరంట్ల మాధవ్‌ (హిందూపురం)లకు ఈసారి వైకాపా పెద్దలు ఎక్కడా టికెట్‌ కేటాయించలేదు. మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఇటీవల నియమించారు. కానీ, వెంటనే అక్కడ మరో కొత్త సమన్వయకర్తను తెరపైకి తీసుకువచ్చి మాధవిని పూర్తిగా పక్కన పెట్టేశారు. మరోచోట టికెట్‌ ఇస్తారా లేదా అనే విషయంపై ఆమెకు స్పష్టత ఇవ్వని పరిస్థితి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేయబోనని ఆ పార్టీ అధిష్ఠానానికి తేల్చి చెప్పేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని