కేంద్రంలో కాంగ్రెస్‌ వస్తేనే రైతులకు న్యాయం

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ హస్తినలో సాగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా బుధవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ-కిసాన్‌ సెల్‌ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు.

Published : 29 Feb 2024 04:04 IST

కిసాన్‌ కాంగ్రెస్‌ వైస్‌ఛైర్మన్‌ కోదండరెడ్డి

నారాయణగూడ, న్యూస్‌టుడే: కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ హస్తినలో సాగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా బుధవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ-కిసాన్‌ సెల్‌ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం నుంచి మొదలైన ఊరేగింపు బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌, లిబర్టీ కూడలి, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయం, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగింది. కార్యక్రమంలో కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మాట్లాడుతూ... నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక రైతుల జీవితాలు బజారునపడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎద్దు, వ్యవసాయం గురించి తెలియని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా రైతులను ఉద్దేశించి అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా వారి ఓటు అడిగే నైతిక హక్కు మోదీకి లేదన్నారు. ర్యాలీలో నేతలు ఇందిరా శోభన్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని