తుమ్మితే ఊడిపోయేలా తెలంగాణ సర్కారు: కె.లక్ష్మణ్‌

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో ఉందని.. తెలంగాణ సర్కారు కూడా తుమ్మితే ఊడిపోయేలా ఉందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Published : 29 Feb 2024 05:20 IST

బషీర్‌బాగ్‌, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, ఐఎస్‌ సదన్‌, న్యూస్‌టుడే: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో ఉందని.. తెలంగాణ సర్కారు కూడా తుమ్మితే ఊడిపోయేలా ఉందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. బుధవారం హైదరాబాద్‌లోని చార్మినార్‌, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర నియోజకవర్గాల్లో ‘భాజపా విజయ సంకల్ప యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఆయన మాట్లాడారు. ‘‘ఎన్నికలకు ముందు అందరికీ పథకాలిస్తామని చెప్పి.. ఇప్పుడు షరతులు విధిస్తున్నారు. రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని చెప్పి.. ఇప్పటివరకు అమలు చేయలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెబితే తప్ప గ్యారంటీలు అమలు కావు. భారాస నేతలు చాలామంది మాతో టచ్‌లో ఉన్నారు. పాతబస్తీలో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు’’ అని పేర్కొన్నారు. యాత్రలో ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని