రైతులను మోసం చేసిన వైకాపా ప్రభుత్వం

రైతుల ఖాతాలో రూ.2 వేల జమ పేరుతో తప్పుడు లెక్కలతో అధికారిక ప్రకటనలు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని తెదేపా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Feb 2024 05:07 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి

నెల్లూరు, న్యూస్‌టుడే: రైతుల ఖాతాలో రూ.2 వేల జమ పేరుతో తప్పుడు లెక్కలతో అధికారిక ప్రకటనలు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని తెదేపా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘57 నెలల్లో రైతులకు రూ.1,84,567 కోట్ల సాయం చేశామని ప్రకటించుకోవడం పచ్చి మోసం. ధాన్యంతోపాటు ఇతర పంటల కొనుగోళ్లకు రూ.74 వేల కోట్లు త్యాగం చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. ధాన్యం కొని డబ్బులివ్వడం సాయమవుతుందా? చరిత్రలో ఎక్కడా ఇది చూడలేదు. కనీస మద్దతు ధరతో పంటలు కొనాలని చట్టమే చెబుతుంటే ఉచిత సాయమంటారా? ఇలాంటి దారుణమైన అబద్ధాలతో కూడిన ప్రకటనలు ఇస్తుంటే ఐఏఎస్‌ అధికారులు ఏం చేస్తున్నారు? రైతు భరోసాకు రూ.34,288 కోట్లు వెచ్చించినట్లు చూపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా పోను వైకాపా ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.20,788 కోట్లే. వాస్తవంగా అయిదేళ్లలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చేసిన ఖర్చు రూ.28,758 కోట్లే..’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని