లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ఖరారుకు భాజపా కమిటీ భేటీ

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే భాజపా అభ్యర్థుల తొలి జాబితా ఖరారుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం రాత్రి సమావేశమైంది.

Published : 01 Mar 2024 03:26 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే భాజపా అభ్యర్థుల తొలి జాబితా ఖరారుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం రాత్రి సమావేశమైంది. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈసీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే పార్టీ తరఫున పోటీచేసే అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాలని భాజపా భావిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భాజపా ముఖ్యమంత్రులు కూడా విచ్చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సైతం పరిగణనలోకి తీసుకొని.. 2019లో పార్టీ విజయం సాధించలేకపోయిన స్థానాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్న కమలం నేతలు ఈ స్థానాల పేర్లను తొలి జాబితాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇవ్వని భూపేందర్‌ యాదవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, మన్‌సుఖ్‌ మాండవీయ సహా పలువురు కేంద్ర మంత్రులను ఈ సారి ఎన్నికల బరిలోకి దించాలని భాజపా చూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని