3 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం సభలు’

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో నిర్వహించనున్న శంఖారావం సభల్లో పాల్గొననున్నారు.

Published : 01 Mar 2024 04:53 IST

చిత్తూరు, న్యూస్‌టుడే: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో నిర్వహించనున్న శంఖారావం సభల్లో పాల్గొననున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అయిదు రోజుల పాటు లోకేశ్‌ పర్యటన సాగనుంది. ఈ నెల 3, 4న ఒంగోలు, 5, 6న నెల్లూరు పార్లమెంటు పరిధిల్లోని సభల్లో పాల్గొంటారు. అనంతరం 7న తిరుపతి పార్లమెంటు పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో, 8న సూళ్లూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో, 9న చంద్రగిరి, నగరి, 10న గంగాధర నెల్లూరు, చిత్తూరు, 11న పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు లోకేశ్‌ హాజరుకానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని