2న నెల్లూరులో చంద్రబాబు పర్యటన

తెదేపా అధినేత చంద్రబాబు శనివారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు.

Updated : 01 Mar 2024 06:44 IST

అదేరోజు తెదేపాలో చేరనున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు శనివారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. ఇటీవలే వైకాపాకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరనున్నారు. అదే రోజు మధ్యాహ్నం పల్నాడు జిల్లా గురజాలలో నిర్వహించనున్న ‘రా.. కదలి రా’ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ వేదిక మీదే వైకాపాకు రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తిలు తెదేపాలో చేరే అవకాశం ఉంది. 4న రాప్తాడు నియోజకవర్గంలో ‘రా.. కదలి రా’ సభలో తెదేపా అధినేత పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని