సీఎం జగన్‌పై దస్తగిరి పోటీ

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి గురువారం జైభీమ్‌ భారత్‌ పార్టీలో చేరారు.

Updated : 01 Mar 2024 07:34 IST

జైభీమ్‌ భారత్‌పార్టీలో చేరిక

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి గురువారం జైభీమ్‌ భారత్‌ పార్టీలో చేరారు. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి సీఎం జగన్‌కు ప్రత్యర్థిగా జైభీమ్‌ భారత్‌ పార్టీ తరఫున దస్తగిరి పోటీ చేస్తారని శ్రావణ్‌కుమార్‌ వెల్లడించారు. జగన్‌పై అఖండ మెజారిటీతో గెలుస్తానని దస్తగిరి ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు