‘ఎమ్మెల్యేగా గెలిపిస్తే వచ్చే జీతమంతా వాలంటీర్లకే’

వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు వాలంటీర్ల చేతుల్లోనే ఉంటాయని బలంగా నమ్ముతున్న వైకాపా నేతలు వారిపై వరాలు కురిపిస్తున్నారు.

Published : 01 Mar 2024 05:22 IST

దర్శి వైకాపా ఇన్‌ఛార్జి శివప్రసాద్‌రెడ్డి

తాళ్లూరు, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు వాలంటీర్ల చేతుల్లోనే ఉంటాయని బలంగా నమ్ముతున్న వైకాపా నేతలు వారిపై వరాలు కురిపిస్తున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో గురువారం జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమమే ఇందుకు నిదర్శనం. ఈ సమావేశానికి జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మతోపాటు ఆమె కుమారుడు, దర్శి నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి శివప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. అధికారుల సమక్షంలోనే వాలంటీర్లను ప్రలోభాలకు గురిచేశారు. వెంకాయమ్మ మాట్లాడుతూ.. ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రతినిధుల కంటే వాలంటీర్లకే విలువ ఉందన్నారు. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెలనెలా వచ్చే జీతం మొత్తం వాలంటీర్ల కోసమే వెచ్చిస్తా. బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా వాలంటీర్లకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తాం. ఆ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఒక్కో వాలంటీరు పరిధిలో 50 ఇళ్లు ఉంటాయి.. ఆ గృహస్థులను కలిసి వైకాపాకు ఓట్లు వేసేలా కృషి చేయాలి’ అంటూ చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని