‘మాకు ఓటేయకపోతే మీ ఉసురు మాకు తగులుతుందట..!’

‘మీరు మా పార్టీకి ఓటేయకపోతే.. మీ ఉసురు మాకు తగులుతుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు’ అని ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు మహిళలను ఉద్దేశించి అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి.

Published : 02 Mar 2024 05:16 IST

జగన్‌ చెప్పారన్న ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు

మార్టేరు, న్యూస్‌టుడే: ‘మీరు మా పార్టీకి ఓటేయకపోతే.. మీ ఉసురు మాకు తగులుతుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు’ అని ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు మహిళలను ఉద్దేశించి అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామంలో ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ‘పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలన్నీ ఆపేస్తారు. అక్కచెల్లెళ్లు అంతా లబోదిబోమంటారు. అప్పుడు మీ కన్నీళ్లు చూడలేమని సీఎం అన్నారు. వైకాపా ప్రభుత్వం రాకపోతే రాష్ట్రంలోని మహిళలందరూ ఏడుస్తారు. ఆ ఉసురు మాకే తగులుతుందని జగన్‌ చెప్పారు. అందుకే కష్టపడి పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని మాకు సూచించారు. మంచి మెజార్టీతో పార్టీని గెలిపించాలని కోరారు. 155 సార్లు బటన్‌ నొక్కాం.. మీరు 2 సార్లు నొక్కితే సరిపోతుందని సీఎం జగన్‌ చెప్పారు’ అని రంగనాథరాజు తెలిపారు. నియోజకవర్గంలో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలందరికీ చీరలిచ్చామని, మిగిలిన మహిళలకూ ఈ రెండు రోజుల్లోనే అందజేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని