కాళేశ్వరంతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం

రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా మారిందని తెజస అధ్యక్షుడు కోదండరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Published : 02 Mar 2024 04:40 IST

తెజస అధ్యక్షుడు కోదండరాం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా మారిందని తెజస అధ్యక్షుడు కోదండరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడమంటే గోదావరిలో పైసలు పోసినట్లేనని వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టు- నిర్మాణ లోపాలు, అవినీతి, కాగ్‌ నివేదిక’ పై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సాంకేతిక లోపంతో ఏర్పడిన సమస్య కాదు ఇది. ప్రణాళిక, నాణ్యత, డిజైన్‌, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ కుంగింది. స్లాబ్‌ కుంగుబాటు ప్రభావం మిగిలిన పిల్లర్లపై ఉంటుంది. 18 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు నిర్మించిన ప్రాజెక్టు విఫలమైంది. రాష్ట్ర ఇంజినీరింగ్‌ వ్యవస్థను కూడా సంక్షోభంలో పడేసేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. భారాస నాయకులు మేడిగడ్డకు వెళ్లడమంటే అవినీతికి పాల్పడినవారే అద్దంలో మొహం చూసుకున్నట్లు ఉంది. పార్టీ ఆధ్వర్యంలో పదో తేదీన ‘నీళ్లు-నిధులు’పై బహిరంగ చర్చ నిర్వహిస్తాం.’ అని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పీఎల్‌ విశ్వేశ్వరరావు, బైరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని